నదిలో నాలుగు గంటలు

ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమవుతోంది.

Published : 19 Apr 2024 03:30 IST

పారిస్‌: ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమవుతోంది. భద్రత పరంగా కాస్త ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం సెన్‌ నదిలోనే ఈ వేడుకల కోసం కసరత్తులు చేస్తున్నారు. జులై 26న నదిలో నాలుగు గంటల పాటు ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. 205 దేశాలకు చెందిన అథ్లెట్ల బృందాలు 80 పడవలపై పరేడ్‌ నిర్వహిస్తాయి. ఆరు కిలోమీటర్ల పాటు ఈ పరేడ్‌ సాగుతుంది. దీని తర్వాత కళాకారుల ప్రదర్శనలుంటాయి. మధ్యాహ్నం 3.45 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం రాత్రి 11.15 గంటలకు ముగుస్తుంది. 10,500 మంది అథ్లెట్లు పడవల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వేడుకల్లో చివరి అంకానికి ఈఫిల్‌ టవర్‌కు ఎదురుగా ఉన్న ట్రాకాడెరో ప్లాజా వేదిక కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని