ఇషా సత్తా చాటేనా!

హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌కు సవాల్‌. పారిస్‌ ఒలింపిక్స్‌ టికెట్‌ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్‌ రేంజ్‌లో ఆరంభమయ్యే సెలక్షన్‌ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా బరిలో దిగనుంది.

Published : 19 Apr 2024 03:35 IST

దిల్లీ: హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌కు సవాల్‌. పారిస్‌ ఒలింపిక్స్‌ టికెట్‌ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్‌ రేంజ్‌లో ఆరంభమయ్యే సెలక్షన్‌ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. టాప్‌ షూటర్‌ మను బాకర్‌ నుంచి ఆమెకు సవాల్‌ ఎదురు కానుంది. వీరితో పాటు రిథమ్‌ సాంగ్వాన్‌, అబింద్య అశోక్‌, సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌లు కూడా ఈ విభాగంలో పోటీలో ఉన్నారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ విభాగంలో అనీశ్‌ భన్వాలా, విజయ్‌వీర్‌ సిద్ధు నువ్వానేనా అన్నట్లు తలపడబోతున్నారు. ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన షూటర్లు నేరుగా పారిస్‌ టికెట్‌ సంపాదిస్తారు. ఈ నాలుగు ట్రయల్స్‌లో ఉత్తమంగా మూడు స్థానాల్లో నిలిచిన షూటర్లను టీమ్‌ సెలక్షన్‌కు పరిగణిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు