అశుతోష్‌.. నయా మెరుపు

గుజరాత్‌తో పంజాబ్‌ మ్యాచ్‌.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్‌ గెలిచింది!

Published : 19 Apr 2024 03:38 IST

గుజరాత్‌తో పంజాబ్‌ మ్యాచ్‌.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్‌ గెలిచింది! అశుతోష్‌ శర్మ అనే ఓ కుర్రాడు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో పంజాబ్‌ వైపు లాగేశాడు. శశాంక్‌ సింగ్‌తో కలిసి జట్టును గెలిపించాడు. ఎవరీ అశుతోష్‌ అనుకునేలోపే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (33 నాటౌట్‌)పై.. రాజస్థాన్‌ రాయల్స్‌ (31)పై మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ముంబయి ఇండియన్స్‌పై ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! 111/7తో ఓటమి అంచున నిలిచిన జట్టును అద్భుతమైన బ్యాటింగ్‌తో పంజాబ్‌కు ఊపిరిపోశాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో కాళ్లను వంచి ఫైన్‌ లెగ్‌లో కొట్టిన సిక్సర్‌.. మధ్వాల్‌ బౌలింగ్‌లో ఆడిన రివర్స్‌ స్కూప్‌ హైలైట్‌. వికెట్లు పడినా ఏమాత్రం తొణక్కుండా అతడు ఆడిన షాట్లు అద్భుతం. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా.. అతడి పోరాటం అందరిని ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల అశుతోష్‌.. దేశవాళీ మ్యాచ్‌ల్లో హార్డ్‌ హిట్టర్‌గా పేరు పొందాడు. 2023 ముస్తాక్‌ అలీ టోర్నమెంట్లో 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి యువరాజ్‌సింగ్‌ (12) రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ఏడాది వేలంలో రూ.20 లక్షలు వెచ్చించి ఈ కుర్రాడిని పంజాబ్‌ దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని