రాకెట్‌ వదిలేద్దాం అనుకున్నా

గత కొన్నేళ్లలో కెరీర్‌లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్‌ స్టార్‌ అశ్విని పొన్నప్ప తెలిపింది.

Updated : 20 Apr 2024 02:39 IST

దిల్లీ: గత కొన్నేళ్లలో కెరీర్‌లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్‌ స్టార్‌ అశ్విని పొన్నప్ప తెలిపింది. తనీషా క్రాస్టో జతగా పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న అశ్విని ఇలా స్పందించింది. ‘‘రియో ఒలింపిక్స్‌ తర్వాత కెరీర్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆటను కొనసాగించాలా వద్దా అనే ఆలోచనలు వచ్చాయి. కొవిడ్‌ తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయా. తీవ్ర ఒత్తిడికి గురయ్యా. కానీ 2023లో తనీషాతో జత కట్టాక మళ్లీ మునుపటిలా ఆడడం మొదలుపెట్టా. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలామందికి నేను మళ్లీ ఒలింపిక్స్‌ ఆడతానన్న నమ్మకం లేదు. కానీ నేను నమ్మకం కోల్పోలేదు. పారిస్‌లో పూర్తి స్థాయిలో ఆడి సత్తా చాటాలని భావిస్తున్నాం’’ అని అశ్విని తెలిపింది. గతేడాది జనవరి నుంచి  అశ్విని-తనీషా అబుదాబి, గువాహాటి సూపర్‌ 100 టైటిళ్లు గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని