విమానం ఆలస్యమై...

భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్‌ పునియా (86 కేజీలు), సుజీత్‌ కలాకల్‌ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు.

Published : 20 Apr 2024 02:40 IST

భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్‌ పునియా (86 కేజీలు), సుజీత్‌ కలాకల్‌ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీలుగా నిర్వహిస్తున్న ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు వీళ్లు దూరమయ్యారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న ఈ ఇద్దరు.. పోటీలు జరుగుతున్న కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌కు శుక్రవారం ఆలస్యంగా చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అప్పటికే రెజ్లర్ల బరువు పరీక్షించడం ముగిసింది. దుబాయ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా దీపక్‌, సుజీత్‌ విమానం ఆలస్యంగా బిష్కెక్‌కు చేరుకుంది. ఈ కారణంతో భారత రెజ్లర్లను అనుమతించాలని మన కోచ్‌లు కోరినా లాభం లేకపోయింది. రెజ్లర్ల బరువు పరీక్ష కోసం నిర్దేశించిన సమయంలో రిపోర్ట్‌ చేయాల్సిందే. లేదంటే పోటీల్లో పాల్గొనడానికి కుదరదు. మేలో జరిగే ప్రపంచ రెజ్లింగ్‌  క్వాలిఫయర్‌ వీరికి చివరి అవకాశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని