భారత రెజ్లర్లు విఫలం

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు.

Published : 20 Apr 2024 02:40 IST

దక్కని ఒలింపిక్స్‌ కోటా

బిష్కెక్‌: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. ఒక్క బరువు విభాగంలోనూ పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానం దక్కించుకోలేకపోయారు. ప్రతి విభాగంలోనూ సెమీస్‌లో గెలిచిన రెజ్లర్లకు ఒలింపిక్‌ బెర్తు దక్కుతుంది. కానీ శుక్రవారం పురుషుల విభాగంలో ఏ భారత రెజ్లర్‌ కూడా సెమీస్‌ దాటలేకపోయారు. 57 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్‌ సెమీస్‌లో పరాజయం పాలయ్యాడు. 0-10 తేడాతో అబ్దుల్లేవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడాడు. మరోవైపు జైదీప్‌ (74 కేజీలు), సుమిత్‌ (125 కేజీలు) క్వార్టర్స్‌లో ఓటమి చెందారు. దీపక్‌ (97) క్వాలిఫికేషన్‌ రౌండ్లోనే నిష్క్రమించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు