మెరిసిన ఇషా, భవేష్‌

ఒలింపిక్స్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్‌, భవేష్‌ షెకావత్‌ మెరిశారు.

Published : 20 Apr 2024 02:43 IST

దిల్లీ: ఒలింపిక్స్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్‌, భవేష్‌ షెకావత్‌ మెరిశారు. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లతో హైదరాబాదీ షూటర్‌ ఇషా అగ్రస్థానం సాధించింది. సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ (583), మను బాకర్‌ (582), అభిద్న్య పాటిల్‌ (577), రిథమ్‌ సాంగ్వాన్‌ (574) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల 25 మీ ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో భవేష్‌ (580) ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు. విజయ్‌వీర్‌ సిద్ధూ (579), అనీష్‌ (578), ఆదర్శ్‌ సింగ్‌ (572), అంకుర్‌ గోయెల్‌ (564) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శనివారం ఫైనల్స్‌ జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని