రేసులో గుకేశ్‌ ఒక్కడే..

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు.

Published : 20 Apr 2024 02:44 IST

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. 12వ రౌండ్లో నజత్‌ అబ్సోవ్‌ (అజర్‌బైజాన్‌)ను ఓడించిన అతడు.. మొత్తం 7.5 పాయింట్లతో హికరు నకముర (అమెరికా), నిపోమ్నియాషి (రష్యా)తో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం అయిదుగురు బరిలో దిగగా.. ప్రస్తుతం గుకేశ్‌కు మాత్రమే టైటిల్‌ గెలిచే అవకాశముంది! 12వ రౌండ్లో ఇయాన్‌ నిపోమ్నియాషితో ప్రజ్ఞానంద డ్రా చేసుకోగా.. ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో విదిత్‌ ఓడిపోయాడు. 6 పాయింట్లతో ప్రజ్ఞానంద అయిదో స్థానంలో.. 5 పాయింట్లతో విదిత్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. మరో రెండు రౌండ్లే మిగిలున్న ఈ టోర్నీలో వీరికి టైటిల్‌ సాధించే అవకాశాలు లేనట్లే. మహిళల విభాగం పన్నెండో రౌండ్లో అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో కోనేరు హంపి డ్రా చేసుకుంది. అనా ముజ్‌చుక్‌ (ఉక్రెయిన్‌)పై వైశాలి విజయం సాధించింది. కేథÇరినా లాగ్నో, గొర్యాచ్కినాతో ఉమ్మడిగా హంపి (6 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతోంది. వైశాలి (5.5) ఆరో స్థానంలో ఉంది. జొంగ్‌యీ తాన్‌ (చైనా, 8) అగ్రస్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు