బుమ్రా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌.. నా కల!

అశుతోష్‌ శర్మ.. ఈ ఐపీఎల్‌లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు.

Published : 20 Apr 2024 02:45 IST

ముల్లాన్‌పుర్‌: అశుతోష్‌ శర్మ.. ఈ ఐపీఎల్‌లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. ఈ సీజన్లో పంజాబ్‌ కింగ్స్‌ ప్రదర్శన అంతంతమాత్రమే అయినా.. ఆ జట్టు తరఫున అశుతోష్‌ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ముంబయిపై 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు అశుతోష్‌. ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేసిన ముంబయి 9 పరుగుల తేడాతో గట్టెక్కింది. బుమ్రా లాంటి మేటి బౌలర్‌ను అశుతోష్‌ గొప్పగా ఎదుర్కొన్నాడు. 13వ ఓవర్లో బుమ్రా ఫుల్‌టాస్‌ను అతను బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచిన తీరు అమోఘం. ఈ షాట్‌ గురించి అశుతోష్‌ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడడం నాకు కల. స్వీప్‌ షాట్‌ సాధన చేశాను. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ను అలా ఎదుర్కోవడం గొప్పగా అనిపించింది. మ్యాచ్‌ గెలిపించగలనని నా మీద నేను బలమైన నమ్మకం పెట్టుకున్నా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు