టెన్నిస్‌కు ముగురుజ వీడ్కోలు

రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ గార్బైన్‌ ముగురుజ (స్పెయిన్‌) టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. ‘‘రిటైర్‌ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నా.

Published : 22 Apr 2024 02:55 IST

మాడ్రిడ్‌: రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ గార్బైన్‌ ముగురుజ (స్పెయిన్‌) టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. ‘‘రిటైర్‌ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నా. వీడ్కోలు అనే మాట కాస్త కష్టంగానే ఉంది. ఇప్పటిదాకా సాధించిన దాంతో గర్వపడుతున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’’ అని మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ముగురుజ చెప్పింది. 2016 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ గెలిచిన ముగురుజ.. అరంటా సాంజెస్‌ వికారియో తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన స్పెయిన్‌ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఆ తర్వాత 2017 వింబుల్డన్‌ తుదిపోరులో వీనస్‌ విలియమ్స్‌పై నెగ్గి ట్రోఫీ నెగ్గింది. 2015 వింబుల్డన్‌, 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో రన్నరప్‌గా నిలిచింది. చివరిగా 2021 ఏటీపీ ఫైనల్స్‌లో గెలవడమే ముగురుజకు పెద్ద విజయం. 2023 జనవరి నుంచి ఆమె బరిలో దిగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని