ఒలింపిక్స్‌కు బల్‌రాజ్‌, అక్ష్దీప్‌, ప్రియాంక

ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్‌, పారాలింపిక్‌ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్‌ ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్‌ స్కల్‌ 2000 మీటర్ల విభాగంలో బల్‌రాజ్‌ మూడో స్థానంలో నిలిచి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్నాడు.

Published : 22 Apr 2024 02:57 IST

దిల్లీ: ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్‌, పారాలింపిక్‌ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్‌ ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్‌ స్కల్‌ 2000 మీటర్ల విభాగంలో బల్‌రాజ్‌ మూడో స్థానంలో నిలిచి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్నాడు. రోయింగ్‌లో భారత్‌ తరఫున పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారుడు బల్‌రాజే. రేస్‌ వాకింగ్‌లో భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్తు ఖరారైంది. మిక్స్‌డ్‌ రిలే టీమ్‌ విభాగంలో అక్ష్దీప్‌ సింగ్‌-ప్రియాంక గోస్వామి పారిస్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆదివారం ప్రపంచ అథ్లెటిక్స్‌ రేస్‌ వాకింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అక్ష్దీప్‌ జంట 3 గంటల 5 నిమిషాల 3 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 18వ స్థానంలో నిలిచింది. 20 కి.మీ నడకలో భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. పురుషుల్లో సెర్విన్‌ సెబాస్టియన్‌ (గంటా 21 నిమిషాల 39 సెకన్లు) 20వ స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత వికాస్‌ సింగ్‌ (గంటా 21 నిమిషాల 59 సెకన్లు) కాస్త మెరుగ్గా 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ఒక్కరు కూడా పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (గంటా 20 నిమిషాల 10 సెకన్లు) అందుకోలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని