తిరుగులేని వెర్‌స్టాపెన్‌

ఫార్ములావన్‌ స్టార్‌ రేసర్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్‌బుల్‌ రేసర్‌ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు.

Published : 22 Apr 2024 02:58 IST

షాంఘై: ఫార్ములావన్‌ స్టార్‌ రేసర్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్‌బుల్‌ రేసర్‌ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు. ఆదివారం చైనీస్‌ గ్రాండ్‌ ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో జరిగిన అయిదు రేసుల్లో ఈ డచ్‌ రేసర్‌కు ఇది నాలుగో విజయం. గత 27 రేసుల్లో 23వది. 2019 తర్వాత తొలిసారి చైనాలో జరిగిన ఈ రేసులో వెర్‌స్టాపెన్‌ ఆధిపత్యం ప్రదర్శించాడు. గంటా 40 నిమిషాల 52.554 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. నోరిస్‌ (మెక్‌లారెన్‌), పెరెజ్‌ (రెడ్‌బుల్‌), లెక్లెర్క్‌ (ఫెరారీ), సెయింజ్‌ జూనియర్‌ (ఫెరారీ) వరుసగా ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు. దిగ్గజం హామిల్టన్‌ (మెర్సీడెజ్‌) 9వ స్థానంతో సంతృప్తి చెందాడు. చైనా రేసర్‌ జో గుయాన్య 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని