టైటిల్‌ దిశగా గుకేశ్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్‌ టైటిల్‌కు చేరువయ్యాడు. మరో రౌండ్‌ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.

Published : 22 Apr 2024 03:02 IST

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్‌ టైటిల్‌కు చేరువయ్యాడు. మరో రౌండ్‌ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 13వ రౌండ్లో ఫిరౌజా అలీరెజా (ఫ్రాన్స్‌)పై గుకేశ్‌ విజయం సాధించాడు. మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. మరో గేమ్‌లో ఇయాన్‌ నెపోమ్నియాషి (8 పాయింట్లు- రష్యా)తో నకముర (8- అమెరికా) డ్రా చేసుకున్నాడు. నెపోమ్నియాషి, నకముర, ఫాబియానో కరువానా (అమెరికా) ఎనిమిదేసి పాయింట్లతో ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి ఆరేసి పాయింట్లతో సంయుక్తంగా అయిదో స్థానంలో కొనసాగుతున్నారు. చివరి రౌండ్లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా క్యాండిడేట్స్‌ టైటిల్‌ గుకేశ్‌ సొంతమవుతుంది. అదే జరిగితే 17 ఏళ్ల గుకేశ్‌.. చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తాడు. మహిళల విభాగంలో వైశాలి వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. 13వ రౌండ్లో లీ టింగ్జీ (చైనా)పై వైశాలి (6.5) గెలుపొందింది. అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో కోనేరు హంపి (6.5) డ్రా చేసుకుంది. తాన్‌ జోంగ్‌యీ (చైనా) 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని