కోహ్లీకి కోపమొచ్చింది

కోల్‌కతాతో మ్యాచ్‌లో కోహ్లీకి కోపమొచ్చింది. ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టిన అతను ఛేదనలో దూకుడు ప్రదర్శించాడు.

Published : 22 Apr 2024 03:06 IST

కోల్‌కతాతో మ్యాచ్‌లో కోహ్లీకి కోపమొచ్చింది. ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టిన అతను ఛేదనలో దూకుడు ప్రదర్శించాడు. కానీ మూడో ఓవర్లో హర్షిత్‌ వేసిన తొలి బంతికి కోహ్లి ఔటయ్యాడు. క్రీజు బయట ఉన్న కోహ్లి స్లో ఫుల్‌టాస్‌ను అంచనా వేయలేక బంతిని అక్కడే గాల్లోకి లేపగా హర్షిత్‌ క్యాచ్‌ పట్టాడు. కానీ అది నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని కోహ్లి సమీక్ష కోరేందుకు సిద్ధమయ్యాడు. కానీ అంపైర్లే దీన్ని టీవీ అంపైర్‌కు సిఫార్సు చేశారు. రీప్లేలో చూసిన తర్వాత కోహ్లి క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని టీవీ అంపైర్‌ ఔటిచ్చాడు. నేలపై నుంచి కోహ్లి నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా.. అతను ఆడినప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్‌ నిర్ణయించాడు. కానీ ఈ నిర్ణయంపై కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాదించాడు. పెవిలియన్‌ వైపు వెళ్తూ మళ్లీ వచ్చి అంపైర్లతో మాట్లాడి నిష్క్రమించాడు. అంతకుముందు కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రసెల్‌ ఆడిన తొలి బంతికే వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ ఆ ఫుల్‌టాస్‌ నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అతణ్ని నాటౌట్‌గా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని