ఇషాకు మూడో స్థానం

ఒలింపిక్‌ షూటింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్‌ మూడో స్థానంలో నిలిచింది.

Published : 23 Apr 2024 03:19 IST

దిల్లీ: ఒలింపిక్‌ షూటింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్‌ మూడో స్థానంలో నిలిచింది. సోమవారం కర్ణిసింగ్‌ రేంజ్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లో ఇషా 30 పాయింట్లతో టాప్‌-3లో చోటు దక్కించుకుంది. సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ (37), మను బాకర్‌ (35) తొలి రెండు స్థానాలు సాధించారు. పురుషుల 20 మీటర్ల పిస్టల్‌లో భవేశ్‌ షెకావత్‌ (34) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని