కోహ్లికి జరిమానా

కోల్‌కతాతో ఐపీఎల్‌ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది.

Published : 23 Apr 2024 03:20 IST

దిల్లీ: కోల్‌కతాతో ఐపీఎల్‌ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో కోహ్లి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ ఫుల్‌ టాస్‌ బంతి నోబాల్‌ అని కోహ్లి వాదించాడు.  ఫీల్డ్‌ అంపైర్‌ మూడో అంపైర్‌కు నివేదించగా.. రీప్లే పరిశీలించాక అది నోబాల్‌ కాదని, కోహ్లి ఔటే అని నిర్ధరించారు. అయితే ముందే ఒకసారి అంపైర్‌తో వాదించిన విరాట్‌, పెవిలియన్‌కు వెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చి వాదనకు దిగాడు. డగౌట్‌ చేరే ముందు అక్కడున్న చెత్త డబ్బానూ తన్నాడు. కోహ్లికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని