జకోవిచ్‌కు లారియస్‌ అవార్డు

టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌.. లారియస్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్‌ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌.. కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని గెలుచుకుంది.

Published : 24 Apr 2024 01:56 IST

మాడ్రిడ్‌: టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌.. లారియస్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్‌ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌.. కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని గెలుచుకుంది. నిరుడు మొదటిసారి మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గెలిచిన స్పెయిన్‌ జట్టు.. టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2023) అవార్డును సాధించింది. ఆ జట్టు మిడ్‌ఫీల్డర్‌ ఐతనా బొన్మాటి ఉత్తమ స్పోర్ట్స్‌వుమన్‌గా ఎంపికైంది. రఫెల్‌ నాదల్‌.. స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని