విండీస్‌కు ఆడను

టీ20 ప్రపంచకప్‌ కోసం రిటైర్మెంట్‌ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్‌ మాజీ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 24 Apr 2024 01:57 IST

కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌ కోసం రిటైర్మెంట్‌ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్‌ మాజీ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో ఆడేలా నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోమన్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అతడు స్పందించాడు. ‘‘ఇటీవల నా ప్రదర్శనల నేపథ్యంలో నేను రిటైర్మెంట్‌ను వీడి, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటూ చాలా మంది తమ ఆకాంక్షను వ్యక్తం చేయడం సంతోషాన్నిచ్చింది. కానీ రిటైర్‌ కావాలన్న నా నిర్ణయం పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రాలేను. ఆ ద్వారం మూసుకుపోయింది. ప్రపంచకప్‌లో ఆడే మా జట్టుకు మద్దతిస్తా. గత కొన్ని నెలలుగా మా ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారు. వాళ్లకు నా శుభాకాంక్షలు’’ అని నరైన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని