ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్‌ (అండర్‌-20) అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

Published : 24 Apr 2024 01:59 IST

దుబాయ్‌: ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్‌ (అండర్‌-20) అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. పురుషుల 4×400 మీటర్ల రిలేలో హిమతేజ బరిలో దిగుతున్నాడు. 4×100 మీ బృందంలో హిమతేజతో పాటు కార్తికేయన్‌ సౌందరరాజన్‌, మహేంద్ర, రోహన్‌ ఘోష్‌ కూడా ఉన్నారు. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దొండపాటి జయరాం (200 మీ, 4×400 మీ రిలే), దొడ్ల సాయి సంగీత (400 మీ, 4×400 మీ రిలే) పాల్గొంటున్నారు. ‘‘నిరుడు పురుషుల విభాగంలో 4×100 మీ రిలే జట్టు కాంస్యం, 4×400 మీ బృందం రజత పతకాలు సాధించాయి. ఈసారి రెండు విభాగాల్లో స్వర్ణాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి’’ అని భారత జూనియర్‌ అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని