మెరిసిన జ్యోతి సురేఖ

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్‌ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది.

Published : 24 Apr 2024 02:02 IST

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్‌ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. అదితి స్వామి (704) 8వ, పర్‌ణీత్‌ కౌర్‌ (703) 14వ, అవ్‌నీత్‌ కౌర్‌ (696) 23వ స్థానాలు సాధించారు. సురేఖ, అదితి, పర్‌ణీత్‌లతో కూడిన భారత జట్టు (2118) టీమ్‌ విభాగం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా (2117) రెండు, మెక్సికో (2116) మూడో స్థానాల్లో నిలిచాయి. పురుషుల టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌, ప్రియాంశ్‌లతో కూడిన భారత బృందం (2121) నాలుగో స్థానం సాధించింది. మిక్స్‌డ్‌ టీమ్‌లో సురేఖ- అభిషేక్‌ (1419) జోడీ రెండో స్థానంలో నిలిచింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని