తాగి చెస్‌ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..

చెస్‌ మేటి మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్‌ టెస్ట్‌)లో తన చెస్‌ కెరీర్‌, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

Updated : 25 Apr 2024 08:10 IST

దిల్లీ: చెస్‌ మేటి మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్‌ టెస్ట్‌)లో తన చెస్‌ కెరీర్‌, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. చెస్‌ డాట్‌కామ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో చెస్‌ వ్యాఖ్యాత, గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ హోవెల్‌.. కార్ల్‌సన్‌తో చెస్‌ ఆడుతూ అతణ్ని అనేక కఠిన ప్రశ్నలు, ఇబ్బందికర ప్రశ్నలు అడగడం చూడవచ్చు. కార్ల్‌సన్‌ కూడా హోవెల్‌ను ప్రశ్నలు అడిగాడు. పాలీగ్రాఫ్‌ నిపుణుడు ఒర్జాన్‌ హెస్‌జెదాల్‌.. జవాబులు తప్పో ఒప్పో చెప్పాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడనందుకు చింతిస్తున్నావా అన్న ప్రశ్నకు కార్ల్‌సన్‌ లేదని జవాబివ్వగా.. అతడు నిజమే చెబుతున్నాడని నిపుణుడు చెప్పాడు. తాను తాగి చెస్‌ ఆడిన సందర్భాలున్నాయని చెప్పాడు. కెరీర్‌లో అత్యంత ఇబ్బందికర సందర్భం గురించి అడిగినప్పుడు.. ‘‘ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నా. బోర్డుపై నీళ్లు చల్లా. పావులను పడేశా’’ అని చెప్పాడు కార్ల్‌సన్‌. ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ ఈసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటాడని భావిస్తున్నావా అన్న ప్రశ్నకు కార్ల్‌సన్‌ ‘నో’ అని జవాబిచ్చాడు. అయితే ఇది గుకేశ్‌ క్యాండిడేట్స్‌ టోర్నీ గెలవకముందు తీసిన వీడియో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని