అంజుమ్‌, స్వప్నిల్‌ విజయం

ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌, స్వప్నిల్‌ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్‌లో వాళ్లు విజేతగా నిలిచారు.

Updated : 17 May 2024 03:37 IST

భోపాల్‌: ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌, స్వప్నిల్‌ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్‌లో వాళ్లు విజేతగా నిలిచారు. పురుషుల ఫైనల్లో స్వప్నిల్‌ 463.7 పాయింట్లు స్కోర్‌ చేశాడు. అఖిల్‌ షెరాన్‌ (461.6) రెండో స్థానంలో, ఐశ్వరి తోమర్‌ (451.9) మూడో స్థానంలో నిలిచారు. మహిళల ఫైనల్లో అంజుమ్‌ 463.9 పాయింట్లతో పైచేయి సాధించింది. 1.9 పాయింట్ల తేడాతో సిఫ్ట్‌ కౌర్‌ రెండో స్థానంలో నిలిచింది. అషీ చౌక్సీ (447.3) మూడో స్థానం సాధించింది.


ఏడో స్థానంలో హార్దిక్‌

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య (185 పాయింట్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. భారత్‌ నుంచి ఉత్తమ ర్యాంక్‌ అతడిదే. హసరంగ, షకిబ్‌ అల్‌ హసన్‌ 228 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మహ్మద్‌ నబి (218), సికందర్‌ రజా (210) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మార్‌క్రమ్‌ (205) అయిదో స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (861) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిల్‌ సాల్ట్‌ (802) రెండో స్థానంలో ఉన్నాడు. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 714 పాయింట్లతో ఆరో ర్యాంకు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని