ఫైనల్లో నిఖత్‌

ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎల్డోర్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల  సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్‌ అమ్మాయి తొమిరిస్‌ మిర్జాకుల్‌ను చిత్తు చేసింది.

Published : 17 May 2024 03:10 IST

ఆస్తానా (కజకిస్థాన్‌): ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎల్డోర్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల  సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్‌ అమ్మాయి తొమిరిస్‌ మిర్జాకుల్‌ను చిత్తు చేసింది. మరో ముగ్గురు భారత అమ్మాయిలు.. మీనాక్షి (48కేజీ), అనామిక (50కేజీ), మనీషా (60కేజీ) కూడా ఫైనల్లో ప్రవేశించారు. మీనాక్షి, మనీషా సెమీస్‌లో ప్రత్యర్థులను 5-0తో ఓడించారు. అతిగా పట్టుకోవడం వల్ల ప్రత్యర్థి గుల్నార్‌ తురప్‌బాయ్‌ (కజకిస్థాన్‌) అనర్హతకు గురి కావడంతో అనామిక ముందంజ వేసింది. సోను (63కేజీ), మంజు (66కేజీ) కాంస్య పతకాలతో తమ పోరును ముగించారు. సెమీఫైనల్స్‌లో వాళ్లు ఓడిపోయారు. పురుషుల విభాగంలో యిఫాబా సింగ్‌ సాయిబమ్‌ (48కేజీ), అభిషేక్‌ యాదవ్‌ (67కేజీ), విశాల్‌ (86కేజీ), గౌరవ్‌ చౌహాన్‌ (92+) శుక్రవారం సెమీఫైనల్స్‌ ఆడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని