శ్రీజ.. సింగిల్స్‌లోనూ

తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్‌ విభాగంతో పాటు సింగిల్స్‌లోనూ పారిస్‌ ఒలింపిక్స్‌ బరిలో నిలవనుంది.

Updated : 17 May 2024 04:00 IST

పారిస్‌ ఒలింపిక్స్‌ జట్టులో చోటు

దిల్లీ: తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్‌ విభాగంతో పాటు సింగిల్స్‌లోనూ పారిస్‌ ఒలింపిక్స్‌ బరిలో నిలవనుంది. గురువారం భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య.. పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడే ఆరుగురు సభ్యుల జాబితాను ప్రకటించింది. వెటరన్‌ ఆటగాడు శరత్‌ కమల్‌, హర్మీత్‌ దేశాయ్‌, మానవ్‌ టక్కర్‌ పురుషుల బృందంలో ఎంపికవగా.. మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్‌లకు మహిళల జట్టులో చోటు లభించింది. ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా పురుషుల్లో శరత్‌ కమల్‌, హర్మీత్‌.. మహిళల్లో మనిక, శ్రీజ సింగిల్స్‌లోనూ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 41 ఏళ్ల శరత్‌కమల్‌ ఒలింపిక్స్‌లో పోటీపడనుండటం ఇది అయిదోసారి. తొలిసారి అతడు 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో ఆడాడు. తెలుగమ్మాయి శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని