మను బాకర్‌ జోరు

ఒలింపిక్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్‌ మను బాకర్‌ జోరు కొనసాగుతోంది.

Published : 18 May 2024 03:35 IST

భోపాల్‌: ఒలింపిక్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్‌ మను బాకర్‌ జోరు కొనసాగుతోంది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ట్రయల్స్‌లో బాకర్‌ (241.0) అగ్రస్థానం సాధించింది. ఇషా సింగ్‌ (240.2) రెండు, రిథమ్‌ సాంగ్వాన్‌ (220.3) మూడో స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో నవీన్‌ (246.8), శరబ్‌జ్యోత్‌ సింగ్‌ (242.4), అర్జున్‌సింగ్‌ చీమా (218.8) మొదటి మూడు స్థానాలు సాధించారు. మహిళల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో రమిత జిందాల్‌ (252.6) విజేతగా నిలిచింది. ఇలవెనిల్‌ వలేరివన్‌ (252.1) రెండో స్థానం సాధించింది. పురుషుల విభాగంలో శ్రీకార్తీక్‌ శబరి రాజ్, దివ్యాంష్‌సింగ్‌ పన్వర్‌ 252.5 స్కోరుతో సమంగా నిలిచారు. అర్జున్‌ బబుతా (229.9) మూడో స్థానం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని