నిఖత్‌ పసిడి పంచ్‌

ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్‌బయెవా (కజకిస్థాన్‌)ను చిత్తు చేసింది.

Published : 19 May 2024 02:28 IST

మీనాక్షికి కూడా స్వర్ణం

అస్తానా (కజకిస్థాన్‌): ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్‌బయెవా (కజకిస్థాన్‌)ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో దూకుడుగా ఆడి ఫైనల్‌కు వచ్చిన నిఖత్‌.. పసిడి పోరులోనూ అదరగొట్టింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది. మరో భారత బాక్సర్‌ మీనాక్షి కూడా స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 4-1తో రహ్‌మనోవా (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా నిలిచిన మీనాక్షి విజయాన్ని చేజిక్కించుకుంది. అనామిక (50 కేజీ), మనీషా (60 కేజీ)లకు నిరాశ ఎదురైంది. ఈ భారత అమ్మాయిలు ఫైనల్లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. అనామిక 1-4తో వుయూ (చైనా) చేతితో ఓడగా.. మనీషా 5-0తో గ్రాఫీవా (కజకిస్థాన్‌) చేతిలో చిత్తయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని