పర్వీన్‌ స్థానంలో జైస్మిన్‌

బాక్సర్‌ పర్వీన్‌ హుడాపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్‌ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్‌ సమాఖ్య ఆరంభించింది.

Published : 19 May 2024 02:32 IST

దిల్లీ: బాక్సర్‌ పర్వీన్‌ హుడాపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్‌ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్‌ సమాఖ్య ఆరంభించింది. మే 24న థాయ్‌లాండ్‌లో మొదలయ్యే ఒలింపిక్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లేంబోరియాను బరిలో దింపింది. ఈ కేటగిరిలో ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పర్వీన్‌.. డోపింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బెర్తు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయర్‌ టోర్నీ అయిన 2023 ఆసియా క్రీడల్లో 60 కేజీల విభాగంలో జైస్మిన్‌ పోటీపడినా పతకం గెలవలేకపోయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని