సిఫ్త్‌కౌర్, నీరజ్‌ గెలుపు

ఒలింపిక్‌ షూటింగ్‌ సెలక్షన్‌ ట్రయల్‌-4లో సిఫ్త్‌కౌర్, నీరజ్‌ కుమార్‌ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీపొజిషన్స్‌ తుది పోరులో సిఫ్త్‌ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Published : 19 May 2024 02:33 IST

భోపాల్‌: ఒలింపిక్‌ షూటింగ్‌ సెలక్షన్‌ ట్రయల్‌-4లో సిఫ్త్‌కౌర్, నీరజ్‌ కుమార్‌ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీపొజిషన్స్‌ తుది పోరులో సిఫ్త్‌ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అషీ చోస్కీ (448.1) రెండో స్థానానికి పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్‌ ఫైనల్లో నీరజ్‌ (462.9) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చైన్‌సింగ్‌ (461.2) రెండో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో మొత్తంగా  సిఫ్త్‌కౌర్, అంజుం మౌద్గిల్‌.. పురుషుల్లో ఐశ్వరీ తోమర్, స్వప్నిల్‌ కుస్లే తొలి రెండు స్థానాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ క్వాలిఫికేషన్లో మహిళల విభాగంలో రమిత జిందాల్‌ (636.4), పురుషుల్లో శబరిరాజ్‌ (631.6) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ క్వాలిఫికేషన్లో మను బాకర్‌ (581) అగ్రస్థానంలో నిలవగా.. సురభి (577), పలక్‌ (572), రిథమ్‌ సాంగ్వాన్‌ (572), ఇషా సింగ్‌ (573) తర్వాతి స్థానాలు సాధించారు. పురుషుల్లో శరభ్‌జ్యోత్‌ (584), అర్జున్‌ చీమా (583) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని