రెండో స్థానంలో అర్జున్‌

తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్‌ పెట్రోసియన్‌ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు.

Published : 19 May 2024 02:34 IST

షార్జా: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్‌ పెట్రోసియన్‌ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. మరో తెలుగు కుర్రాడు రాజా రిత్విక్‌.. అభిజిత్‌ గుప్తా చేతిలో ఓడాడు. అమీన్‌ (ఇరాన్‌)తో అరవింద్‌ చిదంబరం డ్రా చేసుకోగా... నిచెంకో (బెలారస్‌)పై నిహాల్‌ సరీన్‌ పైచేయి సాధించాడు. మార్జిన్‌ (రష్యా)తో సంకల్ప్‌.. సామ్‌ (అమెరికా)తో అభిమన్యు పౌర్ణిక్‌ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం అర్జున్‌ 3 పాయింట్లతో పౌర్ణిక్, సంకల్ప్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. అరవింద్‌ 3.5 పాయింట్లతో సలె సలీమ్‌ (యూఏఈ), హాన్స్‌ (అమెరికా)తో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు