నా బ్యాటింగ్‌ అంత గొప్పగా లేదు: రోహిత్‌

ప్రస్తుత ఐపీఎల్‌లో తన బ్యాటింగ్‌ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

Published : 19 May 2024 02:35 IST

ముంబయి: ప్రస్తుత ఐపీఎల్‌లో తన బ్యాటింగ్‌ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ‘‘బ్యాటర్‌గా నేను ఆశించిన ప్రమాణాల మేర ఆడలేదని నాకు తెలుసు. కానీ ఇన్నేళ్లు ఆడిన అనుభవంతో నాకో విషయం మాత్రం తెలుసు. అతిగా ఆలోచిస్తే నేను బాగా ఆడలేను’’ అని రోహిత్‌ అన్నాడు. ‘‘సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తా. సాధన చేస్తూ నా ఆటలోని లోపాలను సవరించుకుంటా. నేను ఎప్పుడూ చేసేది అదే. ముంబయికి ఈ సీజన్‌ ప్రణాళిక ప్రకారం సాగలేదు. అందుకు మమ్మల్ని మేమే నిందించుకోవాలి. చాలా తప్పులు చేశాం. గెలవాల్సిన చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. కానీ ఐపీఎల్‌లో ఇలా జరగడం మామూలే. కొన్ని అవకాశాలే లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు