25న న్యూయార్క్‌కు భారత క్రికెటర్లు

సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ కోసం ఈ నెల 25న న్యూయార్క్‌ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫైనల్‌ (మే 26) తర్వాత వెళ్తారు.

Published : 19 May 2024 02:37 IST

దిల్లీ: సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ కోసం ఈ నెల 25న న్యూయార్క్‌ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫైనల్‌ (మే 26) తర్వాత వెళ్తారు. ‘‘సహాయ సిబ్బందితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్, బుమ్రా, పంత్, అర్ష్‌దీప్, అక్షర్‌ పటేల్‌ తదితర ఆటగాళ్లు మే 25న ప్రపంచకప్‌ కోసం బయల్దేరే అవకాశముంది’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఐపీఎల్‌ ఫైనల్లో ఆడే ఆటగాళ్లు మాత్రమే భారత్‌లో ఉంటారు. వాళ్లు ఈ నెల 27న న్యూయార్క్‌ వెళ్తారు. టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని