‘లక్ష్య’ దీప్తి రికార్డు

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది.

Published : 20 May 2024 02:00 IST

కోబె (జపాన్‌): ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. ప్రతిష్టాత్మక టోర్నీలో ఆసియా రికార్డుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్‌ను 56.18 సెకన్లలో ముగించిన దీప్తి ఆసియా రికార్డును తిరగరాసి ఫైనల్‌కు అర్హత సాధించింది. హైజంపర్‌ నిషాద్‌ కుమార్, ప్రీతి పల్‌ పతకాలతో మెరిశారు. పురుషుల టీ47 హైజంప్‌లో నిషాద్‌ (1.99 మీటర్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతం సాధించాడు. మహిళల టీ35 200 మీ ఫైనల్లో ప్రీతి (30.49 సెకన్లు) కాంస్య పతకం నెగ్గింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని