ధోని ఆఖరి మ్యాచ్‌ ఆడాడని అనుకోవట్లేదు

దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.

Updated : 20 May 2024 06:08 IST

దిల్లీ: దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ధోని మరింత కాలం కొనసాగేందుకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను బీసీసీఐ కొనసాగించాలని రాయుడు కోరాడు. ‘‘బెంగళూరుతో మ్యాచ్‌ ధోనీకి ఐపీఎల్‌లో చివరిదని అనుకోవట్లేదు. ఇలా కెరీర్‌ను ముగించాలని అతను భావించడు. ధోని ఔటైనప్పుడు కొంచెం నిరుత్సాహంగా కనిపించాడు. అతనెప్పుడూ అలా ఉండడు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి గొప్పగా ముగించాలని అనుకుని ఉంటాడు. అయితే ధోని గురించి ఏమీ చెప్పలేం. వచ్చే ఏడాది అతను మళ్లీ రావొచ్చు. చివరి కొన్ని ఓవర్లలో వచ్చి ప్రభావం చూపే అవకాశాన్ని ధోనీకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఇస్తుంది. ధోని ఆటను ఇంకా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను బీసీసీఐ తొలగించకపోవడమే మంచిది. కాబట్టి ధోని ఆటను చూడాలా? వద్దా? అన్నది బీసీసీఐ చేతుల్లో ఉంది’’ అని రాయుడు అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని