ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్‌

క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్‌ ప్రసారదారుపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మండిపడ్డాడు.

Published : 20 May 2024 02:04 IST

దిల్లీ: క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్‌ ప్రసారదారుపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మండిపడ్డాడు. ప్రాక్టీసులో స్నేహితులు, సహచరులతో సంభాషణల్ని రికార్డు చేసి, ప్రసారం చేయడంపై రోహిత్‌ అసహనం వ్యక్తం చేశాడు. ముంబయి ఇండియన్స్‌లో తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ అన్నట్లుగా వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్‌ అయింది. ‘‘క్రికెటర్ల జీవితాల్లోకి సులువుగా చొరబాట్లు జరుగుతున్నాయి. ప్రాక్టీసు లేదా మ్యాచ్‌ రోజుల్లో స్నేహితులు, సహచరులతో ఏకాంతంలో జరిపే ప్రతి సంభాషణను కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. నా సంభాషణను రికార్డు చేయొద్దంటూ ప్రసారదారును కోరినా నా గోప్యతకు భంగం కలిగిస్తూనే ఉంది. వీక్షణను పెంచుకోవడం కోసం ప్రత్యేక కథనాలపై దృష్టిసారించడం వల్ల క్రికెటర్లు, అభిమానులు, క్రికెట్‌ మధ్య విశ్వాసం దెబ్బతింటోంది’’ అని ఎక్స్‌’ వేదికగా రోహిత్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని