లీగ్‌ దశ ముగిసె..

పరుగుల వరద పారిన మ్యాచ్‌లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌-17లో లీగ్‌ దశ ముగిసింది.

Published : 20 May 2024 02:04 IST

రుగుల వరద పారిన మ్యాచ్‌లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌-17లో లీగ్‌ దశ ముగిసింది. చాలా మ్యాచ్‌ల్లో 200పైన స్కోరు కావడం ఈసారి విశేషం. అయితే వర్షంతో ఆఖర్లో కొన్ని మ్యాచ్‌లకు ఆటంకం కలగడం.. మ్యాచ్‌లు రద్దు కావడం ఒక్కటే   అభిమానులను నిరాశపరిచింది. 20 పాయింట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌  అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా, రాజస్థాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మూడు ప్లేఆఫ్‌ బెర్తులు దక్కించుకుంటే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైని ఇంటికి పంపిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. అనూహ్యంగా ఆఖరి బెర్తును పట్టేసింది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ను కోల్‌కతా ఢీకొంటుంది. బుధవారం ఇదే వేదికలో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్, బెంగళూరు అమీతుమీ తేల్చుకుంటాయి. శుక్రవారం క్వాలిఫయర్‌-2 (ఎలిమినేటర్‌ విజేత × క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు) జరుగుతుంది. ఆదివారం చెన్నైలో ఫైనల్‌ ఆడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని