ఆసియా ఆర్చరీకి గణేశ్‌

దక్షిణ కొరియాలోని సువాన్‌లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్‌ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం ఎంపికయ్యాడు.

Published : 21 May 2024 02:34 IST

నాయుడుపేట, న్యూస్‌టుడే: దక్షిణ కొరియాలోని సువాన్‌లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్‌ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం ఎంపికయ్యాడు. తాజాగా భారత ఆర్చరీ సమాఖ్య ఆధ్వర్యంలో హరియాణాలో జరిగిన 2024 ఆర్చరీ ఆసియాకప్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో గణేష్‌ సత్తాచాటి ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. ఈ కప్‌కు వెళ్లే ముందు దిల్లీలో 15 రోజుల పాటు జరిగే భారత ఆర్చరీ సంఘం శిబిరంలో అతడు పాల్గొంటాడు. 2023 ఐర్లాండ్‌లో జరిగిన ప్రపంచ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ టీమ్‌ విభాగంలో గణేశ్‌ రజతం నెగ్గాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు