సింధుకు పరీక్ష

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్‌కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Published : 21 May 2024 02:36 IST

మలేసియా మాస్టర్స్‌ నేటినుంచే

కౌలాలంపూర్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్‌కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం ప్రారంభమయ్యే టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో క్రిస్టీ గిల్మూర్‌ (స్కాట్లాండ్‌)తో అయిదో సీడ్‌ సింధు తలపడుతుంది. రెండో సీడ్‌ వాంగ్‌ యీ (చైనా)తో ఆకర్షి కశ్యప్, ఫాంగ్‌ జీ (చైనా)తో ఉన్నతి హుడా, క్వాలిఫయర్‌తో అష్మిత చాలిహా పోటీపడతారు. పురుషుల సింగిల్స్‌లో తకుమ ఒబయాషి (జపాన్‌)తో కిరణ్‌ జార్జ్‌ తన పోరాటాన్ని ప్రారంభిస్తాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో హువాంగ్‌ సున్‌- లియాంగ్‌ టింగ్‌ (చైనీస్‌ తైపీ) జంటతో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని