నేను దోషిని కాదు

లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై స్థానిక దిల్లీ న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన క్రిమినల్‌ కేసుపై అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ప్రియాంక రాజ్‌పుత్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 22 May 2024 03:26 IST

దిల్లీ: లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై స్థానిక దిల్లీ న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన క్రిమినల్‌ కేసుపై అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ప్రియాంక రాజ్‌పుత్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయమూర్తికి బ్రిజ్‌భూషణ్‌ తెలిపాడు. ‘‘నేను దోషి కానప్పుడు నేరాన్ని ఎందుకు అంగీకరిస్తా?’’ అని పేర్కొన్నాడు. బ్రిజ్‌భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌పై కూడా న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. విచారణ కొనసాగించేందుకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని