గాయత్రి జోడీ శుభారంభం

మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ శుభారంభం చేసింది.

Published : 22 May 2024 03:27 IST

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి- ట్రీసా జోడీ 21-14, 21-10తో హువాంగ్‌ సున్‌- లియాంగ్‌ టింగ్‌ (చైనీస్‌ తైపీ) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సిమ్రన్‌ సింఘి- రితిక థాకెర్‌ జోడీ 21-14, 21-13తో ఫతరిన్‌- నపపకోర్న్‌ (థాయ్‌లాండ్‌) జంటపై నెగ్గి ముందంజ వేసింది. రుతుపర్ణ పాండా- శ్వేతపర్ణ పాండా జంట 10-21, 7-21తో సుంగ్‌- చీన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని