సాత్విక్‌-చిరాగ్‌ నం.1 జోడీ

థాయ్‌లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ గెలిచిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జంట మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకును సాధించింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఓటమి.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వాకోవర్‌ తర్వాత భారత జంట అగ్రస్థానం నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది.

Published : 22 May 2024 03:29 IST

దిల్లీ: థాయ్‌లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ గెలిచిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జంట మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకును సాధించింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఓటమి.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వాకోవర్‌ తర్వాత భారత జంట అగ్రస్థానం నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది. థాయ్‌లాండ్‌ టైటిల్‌ గెలిచాక 99670 పాయింట్లతో నిలిచిన సాత్విక్‌ జోడీ.. రెండు స్థానాలు మెరుగై మళ్లీ నంబర్‌వన్‌ అయింది. మహిళల సింగిల్స్‌లో సింధు ఒక స్థానం కోల్పోయి 15వ ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ 9వ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. లక్ష్యసేన్‌ 14వ, శ్రీకాంత్‌ 26వ స్థానాల్లో నిలిచారు. మహిళల డబుల్స్‌లో అశ్విని-తనీషా జంట 19.. గాయత్రి-ట్రీసా ద్వయం 29వ ర్యాంకుల్లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని