వయసుకు మినహాయింపు ఉండదు

క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన చేయడం.. వీలైనంతగా ఫిట్‌గా ఉండడమే కీలకమని వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహేంద్రసింగ్‌ ధోని అన్నాడు. 43 ఏళ్లకు చేరువైన ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు.

Published : 22 May 2024 03:30 IST

దిల్లీ: క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన చేయడం.. వీలైనంతగా ఫిట్‌గా ఉండడమే కీలకమని వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహేంద్రసింగ్‌ ధోని అన్నాడు. 43 ఏళ్లకు చేరువైన ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు. ‘‘ఏడాది మొత్తం క్రికెట్‌ ఆడట్లేదు. అందుకే ఐపీఎల్‌ వచ్చేసరికి ఫిట్‌గా ఉండాలి. ఈ లీగ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న యువ ఆటగాళ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్‌ ఆట అంత తేలికేం కాదు. ఇందులో వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరు. ఆడాలని అనుకుంటే ఫిట్‌గా ఉండక తప్పదు. ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు కఠోర సాధన చేయాలి. మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి’’ అని ధోని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నా. నాకెంతో  ఇష్టమైన వ్యవసాయంపై దృష్టి పెట్టా. మోటార్‌బైకులు, వింటేజ్‌ కార్లలో తిరుగుతున్నా. కుక్కలను పెంచడం అంటే కూడా ఎంతో ఇష్టం’’ అని మహి పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని