నాపై ఒత్తిడేమీ ఉండదు: ప్రజ్ఞానంద

నార్వే చెస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)ను అతడి సొంతగడ్డపై ఎదుర్కొనేటప్పుడు తనపై ఒత్తిడేమీ ఉండదని ప్రజ్ఞానంద అన్నాడు.

Published : 23 May 2024 02:32 IST

స్టావెంజర్‌: నార్వే చెస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)ను అతడి సొంతగడ్డపై ఎదుర్కొనేటప్పుడు తనపై ఒత్తిడేమీ ఉండదని ప్రజ్ఞానంద అన్నాడు. గతంలో ప్రజ్ఞానంద చాలా సార్లు కార్ల్‌సన్‌పై గెలిచాడు. చివరగా ఈ నెలలోనే సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో అతణ్ని ఓడించాడు. ‘‘కార్ల్‌సన్‌ను అతడి సొంతగడ్డపై ఎదుర్కోవడం నాకు సవాలేమీ కాదు. దాన్ని నేను పట్టించుకోను’’ అని ప్రజ్ఞానంద అన్నాడు. ‘‘గట్టి సవాల్‌ను నేను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తా. నిరుడు ప్రపంచకప్‌ తర్వాత క్లాసికల్‌ గేమ్‌లో కార్ల్‌సన్‌తో ఆడనుండడం నాకిదే తొలిసారి. అతడితో తలపడాలనే ఉత్సాహంతో ఉన్నా. ఇతరులతో పోటీపైనా అంతే ఆసక్తితో ఉన్నా. ఇక్కడ ఆడిన అనుభవం భవిష్యత్తు టోర్నమెంట్లలో నాకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు’’ అని చెప్పాడు. నార్వే చెస్‌ టోర్నీ ఈ నెల 27న ఆరంభం కానుంది. 11 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్, హికరు నకముర కూడా పోటీపడుతున్నారు. ఈ టోర్నీ డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రజ్ఞానంద సోదరి వైశాలి, కోనేరు హంపి నార్వే టోర్నీలో మహిళల విభాగంలో పోటీపడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని