నేనైతే మొదట కోహ్లినే ఎంపిక చేస్తా

విరాట్‌ కోహ్లిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి భారత్‌లో జనం కారణాలు వెతుకుతారని, తానైతే టీ20 ప్రపంచకప్‌కు మొదట అతణ్నే ఎంచుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు.

Updated : 23 May 2024 10:07 IST

బెంగళూరు: విరాట్‌ కోహ్లిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి భారత్‌లో జనం కారణాలు వెతుకుతారని, తానైతే టీ20 ప్రపంచకప్‌కు మొదట అతణ్నే ఎంచుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. సూపర్‌ ఫామ్‌ను ప్రదర్శిస్తోన్న కోహ్లి ఐపీఎల్‌లో 741 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ‘‘నేనైతే మొదట కోహ్లినే భారత జట్టుకు ఎంపిక చేస్తా. అతడు క్లాస్‌ ఆటగాడు. అనుభవజ్ఞుడు. అలాంటి క్రికెటర్‌ను మరొకరితో భర్తీ చేయలేం. తమాషా ఏంటంటే.. భారత్‌లో జనం అతణ్ని జట్టుకు ఎంపిక చేయకుండా ఉండేందుకు లేదా టీ20 క్రికెట్లో కొందరు ఇతర ఆటగాళ్ల కంటే అతడు ఎందుకు మెరుగు కాదో చెప్పేందుకు కారణాలు వెతుకుతుంటారు’’ అని పాంటింగ్‌ అన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభించాలని అతడు అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని