అర్జెంటీనాపై భారత్‌ విజయం

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ ఐరోపా అంచెను భారత పురుషుల జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో 5-4తో అర్జెంటీనాను ఓడించింది.

Published : 23 May 2024 02:35 IST

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌

ఆంత్వెర్ప్‌ (బెల్జియం): ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ ఐరోపా అంచెను భారత పురుషుల జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో 5-4తో అర్జెంటీనాను ఓడించింది. భారత్‌ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (11వ), లలిత్‌ కుమార్‌ (56వ).. అర్జెంటీనా తరఫున మార్టినెజ్‌ (20వ), థామస్‌ డొమీన్‌ (60వ) గోల్స్‌ కొట్టడంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. షూటౌట్లో భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ సింగ్‌ చెరో రెండు సార్లు స్కోర్‌ చేశారు. అభిషేక్‌ ఒక గోల్‌ కొట్టాడు. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం బెల్జియంను ఢీకొంటుంది.

మహిళల జట్టు ఓటమి: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌లో మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 0-5తో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. అర్జెంటీనా తరఫున జంకునాస్‌ (53వ, 59వ) రెండు గోల్స్‌ కొట్టగా.. గొర్జెలాని (13వ), రపోసో (24వ), విక్టోరియా మిరందా (41వ) తలో గోల్‌ సాధించారు. పేలవ డిఫెన్స్‌ భారత్‌ను దెబ్బతీసింది. కొత్త కోచ్‌ హరేంద్ర సింగ్‌ మార్గనిర్దేశనంలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్‌. మహిళల జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో గురువారం బెల్జియంను ఢీకొంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని