జైస్మిన్, ఫంగాల్‌పైనే దృష్టి

పారిస్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్‌లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్‌ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Published : 24 May 2024 03:00 IST

నేటి నుంచి బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌ 

బ్యాంకాక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్‌లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్‌ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో జైస్మిన్‌ లాంబోరియా (57 కేజీ) పైనే అందరి దృష్టి ఉంది. 57 కిలోలో విభాగంలో పర్వీన్‌ హుడాపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించడంతో కోల్పోయిన ఒలింపిక్స్‌ బెర్తును దక్కించుకునేందుకు భారత బాక్సింగ్‌ సమాఖ్య జైస్మిన్‌ను బరిలో దింపింది. గతంలో 60 కేజీల్లో పోటీపడే జైస్మిన్‌.. 57 కేజీల్లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఆమెతో పాటు అంకుషిత బొరో (60 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ) పోటీపడుతున్నారు. పురుషుల్లో అమిత్‌ ఫంగాల్‌ (51 కేజీ) బరిలో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా టోర్నీలో పసిడితో ఫామ్‌లోకి వచ్చిన అమిత్‌.. ఆ జోరు కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరం. అతడితో పాటు సచిన్‌ సివాచ్‌ (57 కేజీ), అభినాష్‌ (63.5 కేజీ), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీ), అభిమన్యు (80 కేజీ), సంజీత్‌ (92 కేజీ), నరేందర్‌ (92 కేజీ +) కూడా పోటీపడుతున్నారు. ఇప్పటివరకు నిఖత్‌ జరీన్‌ (50 కేజీ), ప్రీతి పన్వర్‌ (54 కేజీ), లవ్లీనా (75 కేజీ) మాత్రమే పారిస్‌ టికెట్‌ సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు