కచనోవ్‌తో నగాల్‌ ఢీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు కఠినమైన డ్రా ఎదురైంది.

Published : 25 May 2024 03:40 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. ఆదివారం ఆరంభమయ్యే ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ కచనోవ్‌ (రష్యా)తో 94వ ర్యాంకర్‌ నగాల్‌ తలపడనున్నాడు. గతేడాది ఈ టోర్నీలో కచనోవ్‌ క్వార్టర్స్‌ చేరాడు. ఇటీవల ఏటీపీ టూర్‌ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాకు నగాల్‌ నేరుగా అర్హత సాధించాడు. ప్రజ్ఞేశ్‌ (2019) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి భారత పురుష ఆటగాడు నగాలే. కానీ  ఈ టోర్నీకి ముందు నగాల్‌ ఫామ్‌ ఆశాజనకంగా లేదు. మాంటెకార్లో మాస్టర్స్, బోర్డాక్స్‌ ఛాలెంజర్, జెనీవా ఓపెన్‌లో నగాల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని