ఒక్సానా ఆశ తీరలేదు

రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఒలింపిక్స్‌లో బరిలో దిగాలని అనుకున్న ఉజ్బెకిస్థాన్‌ జిమ్నాస్ట్‌ ఒక్సానా చెసోవిత్నా కల చెదిరింది.

Published : 25 May 2024 03:40 IST

తాష్కెంట్‌: రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఒలింపిక్స్‌లో బరిలో దిగాలని అనుకున్న ఉజ్బెకిస్థాన్‌ జిమ్నాస్ట్‌ ఒక్సానా చెసోవిత్నా కల చెదిరింది. 48 ఏళ్ల ఒక్సానా గాయంతో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు దూరమైంది. ‘‘క్వాలిఫయర్స్‌లో పాల్గొనట్లేదు. గాయం నన్ను ఒలింపిక్స్‌కు దూరం చేసింది. చాలా రోజులుగా ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డా’’ అని ఒక్సానా ఇన్‌స్టాలో పేర్కొంది. సుదీర్ఘ కాలం జిమ్నాస్టిక్స్‌లో ఉన్న ఆమె.. తొలిసారి 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సోవియట్‌ యూనియన్‌ తరఫున బరిలో దిగింది. ఇటీవల నినా (షూటింగ్, జార్జియా) తొమ్మిదోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఒక్సానా రికార్డును బద్దలుకొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని