అల్కరాస్‌ ముందంజ

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడు.. యువ కెరటం కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్లో శుభారంభం చేశాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ మూడో సీడ్‌ 6-1, 6-2, 6-1తో వోల్ఫ్‌ (అమెరికా)ను చిత్తు చేశాడు.

Updated : 27 May 2024 06:50 IST

ఒసాకా, రుబ్లెవ్‌ కూడా
ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడు.. యువ కెరటం కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్లో శుభారంభం చేశాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ మూడో సీడ్‌ 6-1, 6-2, 6-1తో వోల్ఫ్‌ (అమెరికా)ను చిత్తు చేశాడు. పదోసీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) ముందంజ వేశారు. దిమిత్రోవ్‌ 6-4, 6-3, 6-4తో కవసోవిచ్‌ (అమెరికా)ను ఓడించగా.. రుబ్లెవ్‌ 6-2, 6-7 (3-7), 6-3, 7-5తో డానియల్‌ (జపాన్‌)పై నెగ్గాడు. ఎనిమిదో సీడ్‌ హర్కాజ్‌ (పోలెండ్‌), జాంగ్‌ (చైనా), మార్టినెజ్‌ (స్పెయిన్‌), సొనెగో (ఇటలీ) కూడా తొలి రౌండ్‌ దాటారు. స్పెయిన్‌ దిగ్గజం నాదల్‌ సోమవారం తొలి మ్యాచ్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ)తో తలపడనున్నాడు. 

ఒసాకా కష్టపడి..: మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా (జపాన్‌) తొలి రౌండ్‌ అధిగమించింది. ఆమె 6-1, 4-6, 7-5తో బ్రొంజెటి (ఇటలీ)పై కాస్త కష్టపడి గెలిచింది. తొలి సెట్‌ తేలిగ్గానే నెగ్గిన ఒసాకాకు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండుసార్లు ఒసాకా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన బ్రొంజెటి.. సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌ పదకొండో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన ఒసాకా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఈ జపాన్‌ స్టార్‌ ఆరు ఏస్‌లతో పాటు 31 విన్నర్లు కొట్టింది. మరోవైపు తొమ్మిదోసీడ్‌ ఒస్టాపెంకో (లాత్వియా) 6-4, 7-5తో క్రిస్టియన్‌ (రొమేనియా)ను ఓడించగా.. కెనిన్‌ (అమెరికా) 4-6, 6-2, 6-2తో సిగ్మండ్‌ (జర్మనీ)పై నెగ్గింది. కొస్త్యూక్‌ (ఉక్రెయిన్‌), వికిచ్‌ (క్రొయేషియా), బోజ్కోవా (చెక్‌) తొలి రౌండ్లో గెలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు