దీపిక విఫలం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నమెంట్లో భారత స్టార్‌ దీపిక కుమారికి నిరాశ! ఈ టోర్నీలో పతకం సాధించకుండానే ఆమె వెనుదిరిగింది.

Published : 27 May 2024 03:23 IST

యెచియాన్‌ (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నమెంట్లో భారత స్టార్‌ దీపిక కుమారికి నిరాశ! ఈ టోర్నీలో పతకం సాధించకుండానే ఆమె వెనుదిరిగింది. రికర్వ్‌ మహిళల సింగిల్స్‌  సెమీఫైనల్లో దీపిక 2-6తో లిమ్‌ షియోన్‌ (కొరియా) చేతిలో ఓడింది. కాంస్యం కోసం జరిగిన పోరులోనూ దీపిక 4-6తో అలెగ్జాండ్రా వాలెన్సియా (మెక్సికో) చేతిలో పరాజయం చవిచూసింది. జూన్‌లో అంటాల్యాలో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్లో దీపిక పారిస్‌ బెర్తు కోసం చివరి ప్రయత్నం చేయబోతోంది. స్టేజ్‌-2 టోర్నమెంట్లో భారత్‌ కాంపౌండ్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని