చరిత్ర సృష్టించిన దీప

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించింది.

Published : 27 May 2024 03:24 IST

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పసిడి 

తాష్కెంట్‌ (ఉజ్బెకిస్థాన్‌): భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించింది. తాష్కెంట్‌లో ఆదివారం జరిగిన వాల్ట్‌ ఫైనల్లో దీప 13.566 స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. కిమ్‌ సన్‌ (13.466), జో కియాంగ్‌ (12.966) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్ట్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న దీప.. 2015లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. దీప కాకుండా ఆశిష్‌కుమార్‌ (2015, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌), ప్రణతి నాయక్‌ (2019, 2022, వాల్ట్‌) కాంస్య పతకాలు గెలిచారు. డోపింగ్‌ నేరంపై 21 నెలల నిషేధం తర్వాతి మళ్లీ బరిలో దిగిన దీప.. పారిస్‌ ఒలింపిక్స్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని